రెంట్‌ పేమెంట్స్‌, షాప్‌ రెంట్స్‌.. క్రెడిట్‌ కార్డుతో కడుతున్నారా? వారికి ఇది షాకింగే!

క్రెడిట్‌ కార్డులు ప్రజలకు చేరువయ్యాక వాటితో నగదు ఈజీగా చెల్లించేందుకు అనేక చెల్లింపు విధానాలు అందుబాటులోకి వచ్చాయి.

By అంజి  Published on  30 April 2024 4:30 PM IST
rent payments, shop rents, credit card, Business

రెంట్‌ పేమెంట్స్‌, షాప్‌ రెంట్స్‌.. క్రెడిట్‌ కార్డుతో కడుతున్నారా? వారికి ఇది షాకింగే! 

క్రెడిట్‌ కార్డులు ప్రజలకు చేరువయ్యాక వాటితో నగదు ఈజీగా చెల్లించేందుకు అనేక చెల్లింపు విధానాలు అందుబాటులోకి వచ్చాయి. దానికి తగ్గట్టే వివిధ ట్రాన్సాక్షన్లపై డిస్కౌంట్లు, రివార్డ్‌ పాయింట్లు, క్యాష్‌ బ్యాక్స్‌ వంటి బెనిఫిట్స్‌ ఫిన్‌టెక్‌ కంపెనీలు, బ్యాంకులు అందిస్తున్నాయి. అయితే క్రెడిట్‌ కార్డులపై ఎక్కువ మంది చెల్లించే ట్యూషన్‌ఫీ,రెంట్‌ పేమేంట్స్‌, షాప్‌ రెంట్స్‌, సొసైటీ ఫీజు వంటి వాటిని త్వరలో నిలిపివేయనున్నట్టు తెలుస్తోంది. దేశంలో క్రెడిట్‌ కార్డుల వినియోగం వేగంగా పెరిగింది. వీటితో నెలకు దాదాపు రూ.1.6 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగినట్టు అంచనా వేసింది ఆర్బీఐ. వార్షిక ప్రతిపాదికన గతంతో పోలిస్తే 26 శాతం పెరిగాయి.

ఇందులో పర్సన్‌ టూ పర్సన్‌ చెల్లించే ట్యూషన్‌ ఫీ, రెంట్‌ పేమెంట్స్‌, సొసైటీ బిల్లులే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది. సదరు పేమెంట్స్‌పై ఆర్బీఐ జోక్యం చేసుకోవడంతో బ్యాంకులు అలర్ట్‌ అవుతున్నాయి. క్రెడిట్‌ కార్డు అనే వ్యాపారి - కస్టమర్‌ మధ్య జరిగే చెల్లింపుల కోసం తెచ్చామని, పర్సన్‌ టూ పర్సన్‌ క్రెడిట్‌ కార్డులతో చెల్లించాలంటే స్వీకరించే వ్యక్తి బిజినెస్‌ అకౌంట్‌ తెరవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తరహా పేమెంట్స్‌పై ఆర్బీఐ ప్రత్యేక దృష్టి సారించేందుకు వివిధ కారణాలు ఉన్నాయి. పర్సన్‌ టూ పర్సన్‌ పేమెంట్స్‌ ఎక్కువ అవుతుండటంతో ప్రజలు అవసరానికి మించి క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. స్వీకరించే వ్యక్తి నిజంగానే వ్యాపారా? లేక ఇతర అవసరాలకు నగదు విత్‌ డ్రా చేసుకునేందుకు ఈ పద్ధతిని అవలంభిస్తున్నారా? వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంది.

అలాగే క్రెడిట్‌ కార్డుల బిల్లులు చెల్లించలేకపోవడంతో ఈ నగదు ఏటా పెరిగిపోతోంది. దీనికి ఇదే ప్రధాన కారణంగా ఆర్బీఐ భావిస్తోంది. అయితే ఇప్పటికే చాలా బ్యాంకులు ఈ లావాదేవీలపై రివార్డ్ పాయింట్స్‌ నిలిపివేశాయి. పైగా ఈ తరహా పేమెంట్స్‌కు సంబంధించి బిల్లు తిరిగి చెల్లించేందుకు 40 - 50 రోజుల గడువు ఉండటం, క్రెడిట్‌ కార్డు కంపెనీ, చెల్లింపు చేస్తున్న ప్లాట్‌ఫామ్‌లో 1 - 3 శాతం మాత్రమే ట్యాక్స్‌ విధిస్తుండటంతో ఇతర అవసరాలకు ఉపయోగించేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే బ్యాంకులు ఈ చెల్లింపులను ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ పేమెంట్స్‌ నిలిపివేసేందుకు పెద్దగా సమయమేమీ పట్టకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Next Story