ట్విట్టర్‌కు సమన్లు..!
Parliamentary committee summons Twitter on June 18.ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు షాక్ తగిలింది. నూతన
By తోట వంశీ కుమార్ Published on 15 Jun 2021 8:14 AM GMTప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు షాక్ తగిలింది. నూతన ఐటీ నిబంధనల అమలుపై ట్విట్టర్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఇన్మర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వీటిని జారీ చేసింది. ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని ప్యానెల్ ముందు హాజరు కావాలని కమిటీ ఆదేశించింది. సోషల్ మీడియా, ఆన్‌లైన్ తప్పుడు వార్తల ప్రచారం, దుర్వినియోగం కాకుండా ఎలా వ్యవహరిస్తారో చెప్పాలని కోరింది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకుని డిజిటల్ స్పేస్‌లో మహిళల భద్రతకు రక్షణ కల్పించే అంశంపై ట్విట్టర్ ప్రతినిధి ఉద్దేశాలను తెలుసుకుంటాం అని పార్లమెంటరీ కమిటీ అజెండా పేర్కొంది.
50 లక్షలకు పైగా వినియోగదారులు కలిగిన అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు నూతన ఐటీ నిబంధనల కింద ఆయా సంస్థలు చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్ ను నియమించాల్సి ఉండగా..ట్విట్టర్ ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదు. రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాంటాక్ట్ అధికారులను భారత్‌కు చెందిన వ్యక్తులను నియమించకపోవడంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై కేంద్రం ఇప్పటికే ట్విట్టర్‌కు పైనల్ నోటీసు ఇచ్చింది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి పదే పదే లేఖలు అందినప్పటికీ కూడా ట్విట్టర్ నుండి సరైన స్పందన రాలేదు. అయితే..కొత్త ఐటీ రూల్స్ పాటిస్తామని గత వారంలో ట్విట్టర్ హామీ ఇచ్చింది. భారత్‌లో తాము నిర్మాణాత్మక సంభాషణను కొనసాగిస్తామని ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు.
కొత్త ఐటీ నిబంధనలను పాటించడానికి ట్విట్టర్‌కు ఉన్న ఇబ్బందులు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని పార్లమెంటరీ కమిటీ ప్రకటించింది.