ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ.. మరో కొత్త వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఓలా ఎస్1 స్కూటర్‌ను అధికారికంగా లాంఛ్ చేసింది. రూ.99,999 ధరతో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. ఓలా ఎస్ 1 ప్రోతో పోలిస్తే చిన్న బ్యాటరీ ప్యాక్‌తో ఈ కొత్త వేరియంట్‌ను ఓలా లాంఛ్ చేసింది. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి ఈ కొత్త స్కూటర్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వారు రూ.499 చెల్లించి కంపెనీ వెబ్‌సైట్‌లో ఓలా ఎస్1ను బుక్ చేసుకోవచ్చు.
ఈ స్కూటర్ వైట్, జెట్ బ్లాక్, నియో మింట్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్ కలర్స్‌లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ స్కూటర్ హెడ్‌ల్యాంప్ అప్ ఫ్రంట్, స్మూత్ ప్యానెల్ డిజైన్‌తో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ఎస్1 ప్రొకు వాడిన మోటార్‌నే ఈ ఓలా ఎస్1లో ఉపయోగించారు. అలాగే 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఎకో మోడ్‌లో 128 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఇక ఫుల్ చార్జింగ్‌తో నార్మల్, స్పోర్ట్స్ మోడ్‌లో వరుసగా 101 కి.మీ, 90 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
కాగా ఈ స్కూటర్‌లో క్రూయిజ్ కంట్రోల్, హైపర్ మోడ్ వంటి ఫీచర్లన జోడించలేదు. అయితే మ్యూజిక్, నావిగేషన్, కంపానియన్ యాప్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చారు. ఓలా ఎస్1ని రూ. 2,999తో ప్రారంభమయ్యే ఈఎంఐ ప్లాన్, లోన్ ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపుతో కొనుగోలు చేయవచ్చు.ఈ ఏడాది చివర్లో దీపావళి పండుగ సీజన్‌లో ఓలా మూవ్ ఓస్ 3ని లాంచ్ చేస్తామని ఓలా కంపెనీ ప్రకటించింది. ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. రాబోయే కొద్ది రోజుల్లో టాప్ 50 నగరాల్లో 100 కంటే ఎక్కువ హైపర్‌చార్జర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.