కొత్త సంవత్సరం ఇలా ప్రారంభమైయిందో లేదో అలా సామాన్యులకు భారీ షాక్ తగిలింది. తొలి రోజే గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.25 మేర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై, బెంగళూరు, హైదరాబాద్ సహా అన్ని నగరాల్లో సిలిండర్ ధర పెరిగింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
తాజా పెంపుతో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1769కి చేరింది. కోల్‌కతాలో రూ.1870, ముంబైలో 1721, చెన్నైలో రూ. 1917కి లభిస్తోంది. తెలంగాణలో కూడా వాణిజ్య సిలిండర్ ధర పెరిగింది. హైదరాబాద్‌లో 19 కేజీల సిలిండర్ రేటు రూ.1973, వరంగల్‌లో రూ.2014, కరీంనగర్‌లో రూ.2016.50కి చేరింది. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ సిలిండర్ ధరలను సవరించారు. విజయవాడలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1947, విశాఖపట్టణంలో రూ. 1819కి పెరిగింది.
ఇక్కడ ఊరటనిచ్చే అంశం ఏమిటంటే..? ఆయిల్ కంపెనీలు కేవలం వాణిజ్య సిలిండర్ ధరను మాత్రమే పెంచాయి. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. గత కొంతకాలంగా 14.2 కేజీల సిలిండర్ ధర స్థిరంగానే ఉంది. చివరి సారిగా జులై 6న మాత్రమే రూ.50 పెరిగింది. ఆ తరువాత మళ్లీ ఇప్పటి వరకు పెరగలేదు.