వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధర
October 9th Gold price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు పెరిగితే మరో
By తోట వంశీ కుమార్ Published on 9 Oct 2021 1:57 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు పెరిగితే మరో రోజు తగ్గుతూ ఉంటుంది. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే.. వరుసగా రెండో రోజు పసిడి ధర పెరిగింది. శనివారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశీయంగా 10 గ్రాముల పసిడి ధరపై రూ.100 నుంచి రూ.110 వరకు పెరిగింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,130, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,140
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,900, 24 క్యారెట్ల ధర రూ.47,890
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.