మగువలకు షాక్..పెరిగిన బంగారం ధర
October 8th Gold price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా
By తోట వంశీ కుమార్ Published on 8 Oct 2021 2:16 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఓ రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. నిన్న తగ్గిన బంగారం ధర నేడు పెరిగింది. ఇక భారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ కావడం, పండుగ సీజన్ కావడంతో ధర పెరిగినప్పటికి బంగారానికి డిమాండ్ తగ్గడం లేదు. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 నుంచి 300 వరకు పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాలను ధరల పెరుగుదలల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,120
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,800, 24 క్యారెట్ల ధర రూ.47,780
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.