శుభవార్త.. తగ్గిన బంగారం ధర
October 7th Gold price.భారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ. ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 7 Oct 2021 2:27 AM GMTభారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ. ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది. దీంతో పసిడిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు కాస్త దిగి వచ్చాయి. గురువారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.150 నుంచి రూ.170 వరకు తగ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాలను బట్టి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటుంటాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర .49,910
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,920, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,910
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,680, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,680
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,600, 24 క్యారెట్ల ధర రూ.47,560
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.