భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌రలు ఇలా

October 6th Gold price.బంగారం ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ప్ర‌స్తుతం పండుగ సీజ‌న్ కావ‌డంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Oct 2021 2:04 AM GMT
భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌రలు ఇలా

బంగారం ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ప్ర‌స్తుతం పండుగ సీజ‌న్ కావ‌డంతో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంది. ధ‌ర పెరుగుతున్న‌ప్ప‌టికి కొనుగోలు చేసేందుకు ఏ మాత్రం వెనుకాడ‌డం లేదు. నిన్న స్థిరంగా ఉన్న ప‌సిడి ధ‌ర నేడు భారీగా పెరిగింది. బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.250 నుంచి రూ.400 వ‌ర‌కు పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాలను బ‌ట్టి, డిమాండ్ ఆధారంగా ప‌సిడి ధ‌ర పెరుగుద‌ల‌ల్లో హెచ్చుత‌గ్గులు ఉంటాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,080

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,060

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,680, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,680

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,850

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,750, 24 క్యారెట్ల ధర రూ.47,730

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story