శుభవార్త.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర
October 31th Gold price.పసిడి ప్రియులకు శుభవార్త. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర తగ్గింది. గత కొద్ది
By తోట వంశీ కుమార్ Published on 31 Oct 2021 2:11 AM GMTపసిడి ప్రియులకు శుభవార్త. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర తగ్గింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు బ్రేక్ పడినట్లు అయ్యింది. శనివారం 10 గ్రాముల పసిడి పై రూ.100 నుంచి రూ.330 మేర తగ్గింది. కాగా.. కొన్ని చోట్ల స్వల్పంగా ధర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లోని పరిస్థితుల ఆధారంగా పసిడి ధర తగ్గుదల ఆధార పడి ఉంటుంది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,740 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,740గా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,740
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,060, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,160
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల ధర రూ.48,770
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.