ఈ రోజు బంగారం ధర పెరిగిందా..? తగ్గిందా..?
October 30th Gold Price.పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి
By తోట వంశీ కుమార్ Published on 30 Oct 2021 2:40 AM GMTపసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. రూ.100 నుంచి రూ.200 మధ్య తగ్గింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బంగారం ధర తగ్గగా.. చాలా చోట్ల స్థిరంగా ఉంది. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితుల ఆధారంగా పసిడి ధర తగ్గుదల ఆధార పడి ఉంటుంది. దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,050 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,050 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,270
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,120, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,220
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల ధర రూ.48,930
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.