మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధర
October 29th Gold price.బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఓ రోజు తగ్గితే..
By తోట వంశీ కుమార్ Published on 29 Oct 2021 2:39 AM GMTబంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఓ రోజు తగ్గితే.. మరో రోజు ధర పెరుగుతూ ఉంటుంది. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర నేడు పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర పై రూ.200 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,050 కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,050గా ఉంది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా ధరల పెరుగుదల్లో తేడాలు ఉంటాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,360
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950, 24 క్యారెట్ల ధర రూ.49,040
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.