శుభవార్త.. తగ్గిన బంగారం ధర
October 28th Gold Price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి అన్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 28 Oct 2021 2:43 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి అన్న సంగతి తెలిసిందే. ఓ రోజు తగ్గితే.. మరో రోజు ధర పెరుగుతూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. గురువారం పసిడి ధర తగ్గింది. 10 గ్రాముల పసిడి ధరపై రూ.140 నుంచి 500 మేర తగ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్, పరిస్థితుల ఆధారంగా ధరల తగ్గుదల్లో తేడాలు ఉంటాయి. ప్రస్తుతం పండుగ, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు ఊపందుకున్నాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,130
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,080, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,180
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల ధర రూ.48,820
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.