మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

October 27th Gold price.బంగారం ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి. గ‌త కొద్ది రోజులుగా ప‌సిడి ధ‌రలు పెరుగుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2021 2:34 AM GMT
మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

బంగారం ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి. గ‌త కొద్ది రోజులుగా ప‌సిడి ధ‌రలు పెరుగుతున్నాయి. నేడు కూడా బంగారం ధ‌ర పెరిగింది. బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.200 నుంచి రూ.510 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌, ప‌రిస్థితుల ఆధారంగా ధ‌ర‌ల్లో పెరుగుద‌ల ఉంటుంది. కాగా.. ధ‌ర పెరుగుతున్న‌ప్ప‌టికి పండుగ‌, పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారం కొనుగోలు మాత్రం త‌గ్గ‌డం లేదు.

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,270, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,270

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,510

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,050, 24 క్యారెట్ల ధర రూ.49,150

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story