మ‌గువ‌ల‌కు షాక్‌.. బంగారం ధ‌ర‌ల‌కు రెక్క‌లు

October 24th Gold price.మ‌గువ‌ల‌కు బంగారం ధ‌ర షాకిస్తోంది. రోజు రోజుకు ధ‌ర పెరుగుతూ సామాన్యుడికి అంద‌కుండా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Oct 2021 2:37 AM GMT
మ‌గువ‌ల‌కు షాక్‌.. బంగారం ధ‌ర‌ల‌కు రెక్క‌లు

మ‌గువ‌ల‌కు బంగారం ధ‌ర షాకిస్తోంది. రోజు రోజుకు ధ‌ర పెరుగుతూ సామాన్యుడికి అంద‌కుండా పోతుంది. తాజాగా ప‌సిడి ధ‌ర పెరిగింది. ఆదివారం రూ.220 మేర ప‌సిడి ధ‌ర పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధర రూ.46,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా వద్ద కొనసాగుతోంది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ ఆధారంగా బంగారం ధర పెరుగుద‌ల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల ధర రూ.48,820

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story