మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. ప‌సిడి ధ‌ర‌ల‌కు బ్రేక్‌

October 23rd Gold price.ప‌సిడి కొనుగోలు చేయాల‌నుకునే వారికి నిజంగా ఇది శుభ‌వార్తే. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Oct 2021 2:52 AM GMT
మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. ప‌సిడి ధ‌ర‌ల‌కు బ్రేక్‌

ప‌సిడి కొనుగోలు చేయాల‌నుకునే వారికి నిజంగా ఇది శుభ‌వార్తే. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న ప‌సిడి ధ‌ర‌ల‌ను తాజాగా బ్రేక్ ప‌డింది. నేడు బంగారం ధ‌ర స్వ‌ల్పంగా త‌గ్గింది. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.10 నుంచి రూ. 100 మేర త‌గ్గింది. అయితే.. కొన్ని చోట్ల ధ‌ర‌ల్లో ఎటువంటి మార్పు లేదు. దేశంలోని ఆయా ప్రాంతాల్లో డిమాండ్ ఆధారంగా ధ‌ర‌ల్లో మార్పు ఉంటుంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,460, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,460

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,840, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,920

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల ధర రూ.48,600

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story