మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర

October 22nd Gold price.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధ‌ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Oct 2021 2:48 AM GMT
మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధ‌ర త‌గ్గితే మ‌రో రోజు పెరుగుతూ ఉంటుంది. గ‌త కొద్ది రోజులుగా ప‌సిడి ధ‌ర పెరుగుతూనే ఉంది. తాజాగా కూడా బంగారం ధ‌ర పెరిగింది. శుక్ర‌వారం ప‌ది గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.100 నుంచి రూ.250 వ‌ర‌కు పెరిగింది. దేశంలోని ఆయా న‌గ‌రాలను బ‌ట్టి పెరుగుద‌ల ఉంటుంది. ప్ర‌స్తుతం పండుగ‌, పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్ప‌డింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46, 700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,840, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,920

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,470, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల ధర రూ.48,600

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story