మగువలకు షాక్.. పెరిగిన పసిడి ధర
October 21st Gold Price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధర తగ్గితే..
By తోట వంశీ కుమార్ Published on 21 Oct 2021 2:57 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధర తగ్గితే.. మరో రోజు పెరుగుతూ ఉంటుంది. గత వారం రోజుల్లో రెండు సార్లు తగ్గితే.. నాలుగు సార్లు పెరిగింది. నేడు కూడా పసిడి ధర పెరిగింది. గురువారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.150మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉండే డిమాండ్ ఆధారంగా ధర పెరిగింది. ఇక ప్రస్తుతం పండుగలకు శుభకార్యాలు కూడా తోడు అవ్వడంతో పసిడి కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
-ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,840
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,810
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,490
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,450, 24 క్యారెట్ల ధర రూ.48,490
పసిడి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.