ఈరోజు బంగారం ధర పెరిగిందా..? తగ్గిందా..?
October 20th Gold Price.భారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువ
By తోట వంశీ కుమార్ Published on 20 Oct 2021 2:24 AM GMTభారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో పసిడి కొనుగోళ్లు బాగా ఊపందుకున్నాయి. అయితే.. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు నేడు కాస్త బ్రేక్ పడింది. బుధవారం పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయంగా చాలా చోట్ల ధరల్లో ఎటువంటి మార్పులేదు. అయితే.. కొన్ని చోట్ల స్వల్పంగా ధర తగ్గింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46, 450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల ధర రూ.48,330
పసిడి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.