త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఏ ఏ న‌గ‌రాల్లో ఎంత రేటంటే..?

October 1st Gold price.బంగారం కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌. ప‌సిడి ధ‌ర‌లు దిగివ‌స్తున్నాయి. నిన్న పెరిగిన ప‌సిడి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2021 2:37 AM GMT
త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఏ ఏ న‌గ‌రాల్లో ఎంత రేటంటే..?

బంగారం కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌. ప‌సిడి ధ‌ర‌లు దిగివ‌స్తున్నాయి. నిన్న పెరిగిన ప‌సిడి ధ‌ర నేడు త‌గ్గింది. దేశీయంగా కొన్ని చోట్ల స్వ‌ల్పంగా త‌గ్గ‌గా.. మ‌రికొన్ని చోట్ల భారీగా త‌గ్గింది. శుక్ర‌వారం ప‌సిడి ధ‌ర రూ.600 మేర త‌గ్గింది. బంగారం ధ‌ర‌ల్లో ఎన్ని మార్పులు చోటు చేసుకుంటున్న‌ప్ప‌టికి కొనుగోలు ఆగ‌వు. భార‌తీయ సాంప్ర‌దాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్య‌త ఉండ‌డ‌మే అందుకు కార‌ణం.

దేశీయంగా ప్రధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,360, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,960

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,960

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,960

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,050, 24 క్యారెట్ల ధర రూ.46,960

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story