ప‌సిడి ప్రియుల‌కు షాక్‌.. పెరిగిన బంగారం ధ‌ర

October 18th Gold Price.మ‌హిళ‌ల‌కు బంగారం ధ‌ర‌లు షాకిస్తున్నాయి. గ‌త రెండు రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన ప‌సిడి ధ‌ర నేడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Oct 2021 2:55 AM GMT
ప‌సిడి ప్రియుల‌కు షాక్‌.. పెరిగిన బంగారం ధ‌ర

మ‌హిళ‌ల‌కు బంగారం ధ‌ర‌లు షాకిస్తున్నాయి. గ‌త రెండు రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన ప‌సిడి ధ‌ర నేడు పెరిగింది. మంగ‌ళ‌వారం 10 గ్రాముల బంగారం ధ‌ర పై రూ.110 మేర పెరిగింది. దేశంలోని ఆయా న‌గ‌రాల ఆధారంగా బంగారం ధ‌ర పెరుగుద‌ల్లో వ్య‌త్యాసం ఉంటుంది. దేశీయంగా 10 గ్రాముల 24 క్యారెట్ల ప‌సిడి ధర రూ. 48,330 ఉండ‌గా.. 10 గ్రాముల 22 క్యారెట్ల ధ‌ర రూ.44,300 వ‌ద్ద కొన‌సాగుతోంది.

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46, 450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,620, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,070, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,070

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల ధర రూ.48,330

పసిడి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

Next Story