గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర
October 17th Gold Price.భారత్‌లో బంగారానికి ఉన్న డిమాండ్ మరో దేశంలో ఉండదు. ప్రస్తుతం పండుగల సీజన్
By తోట వంశీ కుమార్ Published on 17 Oct 2021 2:04 AM GMTభారత్‌లో బంగారానికి ఉన్న డిమాండ్ మరో దేశంలో ఉండదు. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో పసిడి కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర నేడు తగ్గింది. ఆదివారం పసిడి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. తాజాగా 10 గ్రాముల పసిడి ధరపై రూ.600 మేర తగ్గింది. చాలా చోట్ల బంగారం ధర తగ్గగా.. మరికొన్ని చోట్ల స్థిరంగా ఉంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. ఇక దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,070 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.48,070 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46, 350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,070, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,070
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల ధర రూ.48,220
పసిడి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.