తగ్గేదే లే.. పెరిగిన బంగారం ధర
October 16th Gold Price.భారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ. ప్రస్తుతం పండుగలతో పాటు పెళ్లిళ్ల సీజన్
By తోట వంశీ కుమార్ Published on 16 Oct 2021 2:39 AM GMTభారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ. ప్రస్తుతం పండుగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడికి డిమాండ్ బాగా ఏర్పడింది. దీంతో ధరలు చుక్కలను అంటుతున్నాయి. నేడు కూడా పసిడి ధర పెరిగింది. శనివారం 10 గ్రాముల బంగారం ధర కొన్ని చోట్ల స్థిరంగా ఉండగా.. చాలా ప్రాంతాల్లో రూ .100 మేర పెరిగింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46, 959, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,220
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,070, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,070
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,870
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,870
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,870
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల ధర రూ.48,870
పసిడి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.