పండుగ వేళ.. బంగారం ధర పెరిగిందా..? తగ్గిందా..?
October 14th Gold price.మనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. ధరలు పెరిగినప్పటికి పసిడి ఉన్న డిమాండ్ తగ్గదు.
By తోట వంశీ కుమార్ Published on 14 Oct 2021 2:02 AM GMTమనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. ధరలు పెరిగినప్పటికి పసిడి ఉన్న డిమాండ్ తగ్గదు. ఆర్థిక అవసరాల్లో బంగారానికి మించి మరేది ఆదుకోదు అనే బావనే అందుకు కారణం కావచ్చు. ఇక పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. గత పది రోజుల్లో బంగారం ధర నాలుగు సార్లు పెరిగింది. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో బంగారం కొనుగోలు పెరిగాయి. తాజాగా గురువారం పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే.. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగాయి. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధర ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46, 300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,440, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,480
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,290
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,400
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150, 24 క్యారెట్ల ధర రూ.48,160
పసిడి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి రూ.61,800 ఉండగా.. చెన్నైలో రూ.65,800, ముంబైలో రూ.65,900, కోల్‌కతాలో రూ.61,800, బెంగళూరులో రూ.61, 800, కేరళలో రూ.65,800, హైదరాబాద్‌లో రూ.65,800, విజయవాడలో రూ. 65,800 ఉంది.