మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర

October 13th Gold price.ప‌సిడి ధ‌రల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధ‌ర పెరిగితే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Oct 2021 2:28 AM GMT
మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర

ప‌సిడి ధ‌రల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధ‌ర పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటుంది. గ‌త రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ప‌సిడి ధ‌ర‌లు తాజాగా పెరిగాయి. పండుగ సీజ‌న్ కావ‌డంతో ధ‌ర‌లు పెరిగిన‌ప్ప‌టికి బంగారానికి డిమాండ్ త‌గ్గ‌డం లేదు. బుధ‌వారం 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.250 వ‌ర‌కు పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో స్వ‌ల్పంగా పెరుగ‌గా.. మ‌రికొన్ని ప్రాంతాల్లో భారీగానే పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46, 300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,320

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,030, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,030

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150, 24 క్యారెట్ల ధర రూ.48,160

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు..

వెండి ధ‌ర‌లు చాలా చోట్ల స్థిరంగానే ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో స్వ‌ల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.61,800 ఉండగా.. చెన్నైలో రూ.65,800, ముంబైలో రూ.65,900, కోల్‌కతాలో రూ.61,800, బెంగళూరులో రూ.61, 800, కేరళలో రూ.65,800, హైదరాబాద్‌లో రూ.65,800, విజయవాడలో రూ. 65,800 ఉంది.

Next Story