శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన వెండి, బంగారం ధ‌ర ఎంతంటే..?

October 11th Gold Price.భార‌త్‌లో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ప్ర‌స్తుతం పండుగ సీజ‌న్(ద‌స‌రా, దీపావ‌ళి)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Oct 2021 7:27 AM IST
శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన వెండి, బంగారం ధ‌ర ఎంతంటే..?

భార‌త్‌లో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ప్ర‌స్తుతం పండుగ సీజ‌న్(ద‌స‌రా, దీపావ‌ళి) కావ‌డంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గ‌త కొద్ది రోజులుగా ప‌సిడి ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటున్నాయి. కాగా.. నేడు బంగారం ధ‌ర స్థిరంగా ఉంది. నిన్న కూడా ధ‌ర‌లు స్థిరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. కొన్ని ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం ధ‌ర‌ల్లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక వెండి ధ‌ర భారీగా త‌గ్గింది. హైద‌రాబాద్‌లో రూ.100 త‌గ్గ‌గా.. ముంబై వంటి న‌గ‌రాల్లో రూ.4వేల‌కు పైగా త‌గ్గింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46060, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,260

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,190, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,060

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,900, 24 క్యారెట్ల ధర రూ.47,890

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధ‌ర‌లు..

ఢిల్లీలో కిలో వెండి రూ.61,700 ఉండగా.. చెన్నైలో రూ.65,800, ముంబై రూ.61,700, కోల్‌కతాలో రూ.61,700, బెంగళూరులో రూ.61, 700, కేరళలో రూ.65,800, హైదరాబాద్‌లో రూ.65,800, విజయవాడలో రూ. 65,800 గా ఉంది.

Next Story