శుభ‌వార్త‌.. స్థిరంగానే బంగారం ధ‌ర‌.. ఏఏ న‌గ‌రాల్లో ఎంతంటే..?

October 10th Gold Price.ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధ‌ర‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Oct 2021 2:08 AM GMT
శుభ‌వార్త‌.. స్థిరంగానే బంగారం ధ‌ర‌.. ఏఏ న‌గ‌రాల్లో ఎంతంటే..?

ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధ‌ర‌కు బ్రేకులు ప‌డింది. ఆదివారం ప‌సిడి ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో స్వ‌ల్పంగా పెరుగ‌గా.. చాలా ప్రాంతాల్లో స్థిరంగా ఉంది. అయితే.. వెండి ధ‌ర మాత్రం భారీగా పెరిగింది. కిలో వెండి పై రూ.700 వ‌ర‌కు పెరిగింది. ప్ర‌స్తుతం పండుగ సీజ‌న్ కావ‌డంతో బంగారానికి భారీగా డిమాండ్ ఉంది.

ప్రధాన నగరాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,900, 24 క్యారెట్ల ధర రూ.47,890

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధ‌ర‌లు..

- ఢిల్లీలో కిలో వెండి రూ.61,800 ఉండగా, చెన్నైలో రూ.65,900, ముంబైలో రూ.61,800, కోల్‌కతాలో రూ.61,800, బెంగళూరులో రూ.65,900, కేరళలో రూ.65,900, హైదరాబాద్‌లో రూ.65,900, విజయవాడలో రూ. 65,900 ఉంది.

Next Story