ఈ రోజు బంగారం ధర పెరిగిందా..? తగ్గిందా..?
November 9th Gold Price.పసిడి కొనుగోలు దారులకు ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. వరుసగా మూడు రోజులు పెరిగిన
By తోట వంశీ కుమార్ Published on 9 Nov 2021 2:33 AM GMTపసిడి కొనుగోలు దారులకు ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరకు కాస్త బ్రేక్ పడింది. నేడు పసిడి ధర స్థిరంగా ఉంది. మంగళవారం ఉదయం చాలా ప్రాంతాల్లో ధరలు స్థిరంగా ఉండగా.. కొన్ని చోట్ల మాత్రం స్వల్పంగా పెరిగింది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా.. ఒక్క ముంబైలో మాత్రమే రూ.800 మేర పెరిగింది. దేశీయంగా.. 10 గ్రాముల బంగారం ధర రూ.47,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,560వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,260, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,560
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,030, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,030
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,420, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,570
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,210
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,110, 24 క్యారెట్ల ధర రూ.49,210
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.