మగువలకు షాక్.. వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధర
November 7th Gold price.కొనుగోలుదారులకు పసిడి ధరలు షాకిస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర
By తోట వంశీ కుమార్ Published on 7 Nov 2021 2:03 AM GMTకొనుగోలుదారులకు పసిడి ధరలు షాకిస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర పెరిగింది. ఆదివారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 నుంచి రూ.900 వరకు పెరిగింది. అయితే.. ఆయా ప్రాంతాల్లో డిమాండ్, పరిస్థితుల ఆధారంగా కొన్ని చోట్ల స్వల్పంగా పెరుగగా.. మరికొన్ని చోట్ల భారీగా పెరిగింది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,220, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,220
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,410, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,540
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల ధర రూ.49,200
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.