షాకిస్తున్న బంగారం.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
November 6th Gold Price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి అన్న సంగతి తెలిసిందే. ఓ రోజు
By తోట వంశీ కుమార్ Published on 6 Nov 2021 2:31 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి అన్న సంగతి తెలిసిందే. ఓ రోజు ధర పెరిగితే మరో రోజు తగ్గుతూ ఉంటుంది. నిన్న నిలకడగా ఉన్న పసిడి ధర నేడు కొన్ని చోట్ల తగ్గగా.. మరికొన్ని చోట్ల పెరిగింది. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో రూ.190 నుంచి రూ.250 వరకు పెరుగగా.. ఇతర ప్రాంతాల్లో రూ.150 నుంచి రూ.250 వరకు తగ్గింది. దేశీయంగా ఆయా ప్రాంతాల్లోని డిమాండ్, పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో వ్యత్సాసం ఉంటుంది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.46,220 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.47,220 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,220, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,220
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల ధర రూ.48,760
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.