పండుగ వేళ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

November 4th Gold price.దీపావ‌ళి పండుగ వేళ మ‌హిళ‌ల‌కు నిజంగా ఇది శుభ‌వార్తే అని చెప్ప‌వ‌చ్చు. ప‌సిడి ధ‌ర‌లు భారీగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Nov 2021 3:44 AM GMT
పండుగ వేళ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

దీపావ‌ళి పండుగ వేళ మ‌హిళ‌ల‌కు నిజంగా ఇది శుభ‌వార్తే అని చెప్ప‌వ‌చ్చు. ప‌సిడి ధ‌ర‌లు భారీగా దిగివ‌చ్చాయి. బంగారం ధ‌ర‌ల్లో అనునిత్యం మార్పులు చోటుచేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజులుగా ప‌రుగులు పెట్టిన ధ‌ర.. రెండు రోజులు స్థిరంగా ఉంది. నిన్న కాస్త పెరిగిన ధ‌ర నేడు భారీగా త‌గ్గింది. గురువారం 10 గ్రాముల ధరపై రూ.200 నుంచి 600 వరకు త‌గ్గింది. దేశ వ్యాప్తంగా ఆయా న‌గ‌రాల్లో ఉన్న డిమాండ్‌, ప‌రిస్థితుల ఆధారంగా బంగారం ధ‌ర‌ల్లో త‌గ్గుద‌ల ఉంటుంది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.46,410 ఉండ‌గా.. 24 క్యారెట్ల ధర రూ.47,410 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,410, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,690, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల ధర రూ.48,600

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story