దీపావళి ధమాకా.. మహిళలకు షాకిస్తున్న బంగారం ధర
November 3rd Gold Price.బులియన్ మార్కెట్‌లో బంగారం దూకుడు కొనసాగుతోంది. ఓ రోజు ధర తగ్గితే మరో రోజు పెరుగుతూ
By తోట వంశీ కుమార్ Published on 3 Nov 2021 2:23 AM GMTబులియన్ మార్కెట్‌లో బంగారం దూకుడు కొనసాగుతోంది. ఓ రోజు ధర తగ్గితే మరో రోజు పెరుగుతూ ఉంటుంది. అయితే.. ఎక్కువ సార్లు ధర పెరుగుతూనే ఉంది. ఇక రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ధర నేడు స్వల్పంగా పెరిగింది. బుధవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.100 నుంచి రూ.200 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లోని పరిస్థితుల ఆధారంగా ధరల పెరుగుదల్లో తేడాలు ఉంటాయి. చాలా చోట్ల ధర పెరగ్గా.. కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉంది. దేశీయంగా 10 గ్రాముల పసిడి ధర రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.47,850 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,200
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,080, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,180
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,870
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,870
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,870
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల ధర రూ.48,870
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.