పండుగ వేళ.. బంగారం ధర పెరిగిందా..? తగ్గిందా..?
November 2nd Gold Price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధర పెరిగితే మరో రోజు
By తోట వంశీ కుమార్ Published on 2 Nov 2021 3:06 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధర పెరిగితే మరో రోజు తగ్గుతూ ఉంటుంది. కాగా.. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు కాస్త బ్రేకులు పడ్డాయి. మంగళవారం పసిడి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. పండుగ సమీపిస్తుండడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.46,740ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,740 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,740
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,110
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల ధర రూ.48,770
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.