పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర
November 27th Gold Price.బంగారం కొనుగోలుదారులకు నిజంగా ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. నిన్నటి వరకు
By తోట వంశీ కుమార్ Published on 27 Nov 2021 2:11 AM GMTబంగారం కొనుగోలుదారులకు నిజంగా ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన ధర నేడు పెరిగింది. ఎనిమిది రోజుల తరువాత శనివారం పసిడి ధర పెరిగింది. నేడు 10 గ్రాముల ధరపై రూ.150 నుంచి 310 వరకు పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,940
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,420, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,560
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల ధర రూ.48,930
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.