నేడు బంగారం ధ‌ర పెరిగిందా..? త‌గ్గిందా..?

November 26th Gold price.బంగారం కొనుగోలుదారుల‌కు నిజంగా ఇది శుభవార్త‌. నేడు ప‌సిడి ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Nov 2021 2:00 AM GMT
నేడు బంగారం ధ‌ర పెరిగిందా..? త‌గ్గిందా..?

బంగారం కొనుగోలుదారుల‌కు నిజంగా ఇది శుభవార్త‌. నేడు ప‌సిడి ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. నిన్న‌టితో పోలిస్తే ధ‌ర పెర‌గ‌లేదు, త‌గ్గ‌లేదు. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌, ప‌రిస్థితుల కార‌ణంగా బంగారం ధ‌ర‌ల్లో తేడాలు ఉంటాయి. దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,100 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,630, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,630

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల ధర రూ.48,760

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story