శుభ‌వార్త‌.. వ‌రుస‌గా రెండో రోజు త‌గ్గిన బంగారం ధ‌ర

November 25th Gold price.మ‌గువ‌ల‌కు నిజంగా ఇది శుభ‌వార్తే. మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన ప‌సిడి ధరలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2021 2:01 AM GMT
శుభ‌వార్త‌.. వ‌రుస‌గా రెండో రోజు త‌గ్గిన బంగారం ధ‌ర

మ‌గువ‌ల‌కు నిజంగా ఇది శుభ‌వార్తే. మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన ప‌సిడి ధరలు క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి. వ‌రుస‌గా రెండో రోజు కూడా ప‌సిడి ధ‌ర‌లు త‌గ్గాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.350మేర త‌గ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌, ప‌రిస్థితుల కార‌ణంగా బంగారం ధ‌ర‌ల త‌గ్గుద‌ల్లో తేడాలు ఉంటాయి. దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,100 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,630, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,630

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల ధర రూ.48,760

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story