మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధర
November 24th Gold Rate.బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునేవారికి నిజంగా ఇది శుభవార్తే. గత కొద్ది రోజులుగా
By తోట వంశీ కుమార్ Published on 24 Nov 2021 7:42 AM ISTబంగారాన్ని కొనుగోలు చేయాలనుకునేవారికి నిజంగా ఇది శుభవార్తే. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఊహించని విధంగా పసిడి రేటు భారీగా పడిపోయింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉన్నాయని పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయం. బుధవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.650 నుంచి రూ.1290 వరకు తగ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్, పరిస్థితుల కారణంగా బంగారం ధరల తగ్గుదల్లో తేడాలు ఉంటాయి. దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,500 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,340, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,460
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,700
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,050, 24 క్యారెట్ల ధర రూ.49,150
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.