మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర
November 16th Gold price.పసిడి ధరల పెరుగుదలకు కొంచెం బ్రేక్ పడింది. పండుగుల, పెళ్లిళ్ల సీజన్ కావడంతో గత కొద్ది
By తోట వంశీ కుమార్ Published on 16 Nov 2021 8:29 AM ISTపసిడి ధరల పెరుగుదలకు కొంచెం బ్రేక్ పడింది. పండుగుల, పెళ్లిళ్ల సీజన్ కావడంతో గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర నేడు కాస్త దిగివచ్చింది. మంగళవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.250 వరకు తగ్గింది. ఇది నిజంగా పసిడి ప్రియులకు కొంత ఊరటనిచ్చే వార్తేనని చెప్పవచ్చు. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్, పరిస్థితుల కారణంగా బంగారం ధరల తగ్గుదల్లో తేడాలు ఉంటాయి. దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,250చేరగా.. 24 క్యారెట్ల ధర రూ.52,620 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,620
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,930, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,310, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,520
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల ధర రూ.50,070
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.