మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర

November 14th Gold Price.కొనుగోలుదారుల‌కు పసిడి ధ‌ర‌లు షాకిస్తున్నాయి. రోజు రోజుకి బంగారం ధ‌ర‌ల‌కు రెక్క‌లొస్తున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Nov 2021 7:45 AM IST
మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర

కొనుగోలుదారుల‌కు పసిడి ధ‌ర‌లు షాకిస్తున్నాయి. రోజు రోజుకి బంగారం ధ‌ర‌ల‌కు రెక్క‌లొస్తున్నాయి. నేడు కూడా బంగారం ధ‌ర పెరిగింది. ఆదివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.200 నుంచి రూ.350 మేర పెరుగ‌గా.. కొద్ది చోట్ల స్థిరంగా ఉంది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌, ప‌రిస్థితుల కార‌ణంగా బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు ఉంటాయి. దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050చేర‌గా.. 24 క్యారెట్ల ధర రూ.52,420 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,280, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,280

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,250

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల ధర రూ.50,180

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story