వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధర
November 12th Gold Price.బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధర పెరిగితే మరో
By తోట వంశీ కుమార్ Published on 12 Nov 2021 7:28 AM ISTబంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధర పెరిగితే మరో రోజు తగ్గుతూ ఉంటుంది. అందుకనే బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునేవారు వాటి ధరలపై దృష్టి సారిస్తుంటారు. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధర పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.500 నుంచి రూ.900 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్, పరిస్థితుల ఆధారంగా ధరల పెరుగుదల్లో తేడాలు ఉంటాయి. ఇక దేశీయంగా 10గ్రాముల బంగారం ధర రూ.48,050 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,340, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,200
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల ధర రూ.50,070
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.