మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర

November 10th Gold Price.బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభ‌వార్త‌. నిన్న‌టితో పోలిస్తే నేడు బంగారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Nov 2021 2:06 AM GMT
మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభ‌వార్త‌. నిన్న‌టితో పోలిస్తే నేడు బంగారం ధ‌ర స్వ‌ల్పంగా త‌గ్గింది. బుధ‌వారం ప‌సిడి ధ‌ర రూ.110 మేర త‌గ్గింది. అయితే.. మున్ముందు పెళ్లిళ్ల సీజ‌న్ ఉండ‌డంతో ప‌సిడి ధ‌ర పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటున్న‌ప్ప‌టికి ప‌సిడి కొనుగోళ్లు మాత్రం ఆగ‌డం లేదు.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,270, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,390

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500, 24 క్యారెట్ల ధర రూ.49,100

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story