కొత్త సంవత్సరంలో యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ షాక్..!
Netflix to charge extra fee from users for sharing their passwords.నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని
By తోట వంశీ కుమార్ Published on 23 Dec 2022 6:02 AM GMTలాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూత పడడంతో జనాలు ఓటీటీల వైపు మొగ్గు చూశారు. వీటిలో ఒకరు సబ్‌స్రిప్షన్ తీసుకుని యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకున్నారు. దీంతో ఒక్క సబ్‌స్రిప్షన్ తో అందరూ ఎంచక్కా ఆయా ఫ్లాట్‌ఫామ్‌లోని కంటెంట్‌ను వీక్షించేవారు. లేదంటే ఇద్దరు లేదా ముగ్గురు కలిసి మనీ షేర్ చేసుకుని సబ్‌స్రిప్షన్ తీసుకుని వాడుకునేవారు. తమ సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోవడానికి ఇదే ప్రధాన కారణంగా ఓటీటీ సంస్థలు బావిస్తున్నాయి.
దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని తొలగించాలని నిర్ణయించింది. 2023 జనవరి నుంచి యూజర్లు తమ నెట్‌ఫ్లిక్స్ ఖాతాల పాస్‌వర్డ్‌లను ఇతరులో షేర్ చేసుకోవడం సాధ్యం కాదు.
గత పది సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంతగా సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోయినట్లు నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది మొదట్లో తెలిపింది. పాస్‌వర్డ్ షేరింగ్ విధానం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు బావించింది. ఈ ఫీచర్ ను తొలగించాలని నిర్ణయించింది. ఒక వేళ ఎవరైనా తమ పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకోవాలంటే అదనంగా కొంత నగదు చెల్లించాల్సి ఉంటుంది.
కోస్టా రికా, చిలీ, పెరూ, లాటిన్ అమెరికన్ దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ఈ విదానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఆ ప్రాంతాల్లో పాస్‌వర్డ్ షేరింగ్‌కు మూడు డాలర్లు( మన కరెన్సీలో రూ.250) నిర్ణయించారు. అయితే భారత దేశంలో పాస్‌వర్డ్ షేరింగ్‌కు ఎంత వసూలు చేయనున్నారు అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఎవరైనా యూజర్ అదనంగా నగదు చెల్లించకుండా పాస్‌వర్డ్ షేర్ చేస్తే ఐపీ అడ్రస్, డివైజ్ ఐడీ, అకౌంట్ యాక్టివిటీ ఆధారంగా లాగిన్ సమస్య ఏర్పడుతుంది.