సెప్టెంబర్ 10 నుంచి జియో ఫోన్ నెక్ట్స్..వెల్లడించిన ముకేశ్ అంబానీ
Mukesh Ambani unveils JioPhone Next 'most affordable smartphone' in the world.రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 44వ
By తోట వంశీ కుమార్ Published on 24 Jun 2021 6:05 PM ISTరిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 44వ వార్షిక సర్వసభ్య సమావేశం ఈరోజు మధ్యాహ్నాం ప్రారంభమైంది. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి కూడా డిజిటల్ పద్దతిలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా సౌదీ అరాం కో చైర్మన్, పీఐఎఫ్ గవర్నర్ యాసిర్ అల్-రుమయ్యాన్ చేరబోతున్నట్టు ప్రకటించారు. బోర్డులో ఆయన చేరిక రియలన్స్ అంతర్జాతీయీకరణకు ప్రారంభమని పేర్కొన్నారు. మహమ్మారి సమయంలోనూ అరాంకో, రిలయన్స్ మధ్య బలమైన బంధం ఏర్పడిందన్నారు. ఈ ఏడాది తమ భాగస్వామ్యం మరింత వేగవంతమువుతందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ గడిచిన ఏడాది కాలంలో అంచనాలకు మించి రాణించింది. కంపెనీ సమీకృత ఆదాయం రూ.54,000 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఈబీఐటీడీఏ రూ.98,000 కోట్లుగా నిలిచింది. వీటిల్లో 50శాతం కన్జ్యూమర్ వ్యాపారం నుంచే లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత ఆర్థిక వ్యవస్థ ఎగుమతుల్లో 6.8శాతం వాటాను అందించింది. ప్రపంచమంతా కరోనా పరిస్థితులను ఎదుర్కొటోన్న సమయంలో కూడా రిలయన్స్ గత సంవత్సరంలో దాదాపు 75,000 కొత్త ఉద్యోగాలను సృష్టించింది. ప్రైవేటు రంగంలో కస్టమ్స్ ,ఎక్సైజ్ సుంకాలను అత్యధికంగా చెల్లించే కార్పోరేట్ సంస్థగా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈక్విటీ క్యాపిటల్‌లో రూ .3.24 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించాము. రిటైల్ వాటాదారులు రైట్ ఇష్యూపై 4x రాబడిని పొందడం ఆనందంగా ఉందన్నారు.
ఇక..జియో ఫ్లాట్‌ఫామ్స్ 37.9 మిలియన్ వినియోగదారులను కొత్తగా చేర్చుకున్నాయని.. మొత్తం 425 మిలియన్ల మందికి సేవలు అందిస్తోందన్నారు. రిలయన్స్ రిటైల్ దేశంలో నెంబర్ వన్ రిటైల్‌గా ఉంది. సమీప పోటీదారు కంటె ఆరు రెట్లు ముందు ఉందన్నారు.
అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్..
గూగుల్, జియో సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'జియో ఫోన్ నెక్ట్స్' ను సెప్టెంబర్ 10న గణేష్ చతుర్థి సందర్భంగా ప్రారంభించనున్నట్లు అంబానీ తెలిపారు. జియో ఫోన్ నెక్స్ట్ పూర్తిగా ఫీచర్ చేసిన స్మార్ట్‌ఫోన్ అని.. గూగుల్, జియో రెండింటి నుండి మొత్తం సూట్ యాప్స్ కు సపోర్టు చేస్తుందని తెలిపారు.
జియో ఫోన్ నెక్స్ట్..ఆండ్రాయిడ్ , అత్యంత ఆప్టిమైజ్ సామర్థ్యంతో పనిస్తుంది ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ , ముఖ్యంగా భారత మార్కెట్ కోసం అభివృద్ధి చేయబడింది. ఈ ఫోన్ లో వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ , ఆటోమేటిక్ రీడ్, ట్రాన్స్ లేషన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్‌లతో కూడిన స్మార్ట్ కెమెరా వంటి ఫీచర్స్ ఉంటాయి. ఇప్పటివరకు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత తక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ గా ఇది నిలవనుందని తెలిపారు.