మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్‌గా సత్య నాదెళ్ల
Microsoft names CEO Satya Nadella as chairman.భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు సత్య నాదెళ్ల మరో ఘనతను
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2021 5:22 AM GMTభారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు సత్య నాదెళ్ల మరో ఘనతను అందుకున్నారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ నూతన చైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ జాన్ థాంప్సన్ స్థానంలో ఎన్నికైన సత్య నాదెళ్ల అతి త్వరలో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈవోగా నాదెళ్ల వ్యవహరిస్తున్నారు. 2014లో స్టీవ్ బామర్ నుంచి ఆయన సీఈవో బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌లో కీలక భాగంగా ఉన్న లింక్డ్ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్ మరియు జెనిమాక్స్ వంటి బిలియన్ డాలర్ల కొనుగోళ్లతో సంస్థ వ్యాపారాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషించారు.
అలాంటిది ఇప్పుడు చైర్మన్‌గా ఎంపిక చేయడం ద్వారా నాదెళ్లకు మైక్రోసాఫ్ట్ మరిన్ని బాధ్యతలు అప్పజెప్పినట్లయింది. కాగా.. ప్రస్తుత సంస్థ చైర్మన్ థాంప్సన్ చైర్మన్ పదవి నుంచి దిగిపోయాక కంపెనీకి స్వతంత్ర డైరెక్టర్‌గా సేవలందిస్తారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇదిలాఉంటే.. దాతృత్వ పనులు నిమిత్తం బోర్డు నుంచి వైదొలగుతానని బిల్‌గేట్స్ ప్రకటించిన సంవత్సరం తరువాత ఉన్నత స్థాయి కీలక ఎగ్జిక్యూటివ్‌ల మార్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు బిల్‌గేట్స్ విడాకులు, ఉద్యోగితో గేట్స్ సంబంధాలపై దర్యాప్తు జరిపినట్లు కంపెనీ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గేట్స్‌ను బోర్డునుంచి తొలగిస్తుందా అనే దానిపై స్పందించడానికి మైక్రోసాఫ్ట్ నిరాకరించింది.