మీరు విండోస్ ఓఎస్ వాడుతున్నారా..? వెంట‌నే అప్‌డేట్ చేయండి.. మైక్రోసాఫ్ట్ హెచ్చ‌రిక‌

Microsoft Issues Emergency Patch for Windows Flaw.మీరు విండోస్ ఓఎస్ వాడుతున్నారా..? అయితే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2021 2:53 AM GMT
మీరు విండోస్ ఓఎస్ వాడుతున్నారా..? వెంట‌నే అప్‌డేట్ చేయండి.. మైక్రోసాఫ్ట్ హెచ్చ‌రిక‌

మీరు విండోస్ ఓఎస్ వాడుతున్నారా..? అయితే వెంట‌నే అప్ర‌మ‌త్తం కండి. విండోస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో ఓ తీవ్ర లోపం బ‌య‌ట‌ప‌డింది. దీంతో విండోస్ వినియోగ‌దారులంతా వెంట‌నే సిస్టం అప్‌డేట్ చేసుకోవాల‌ని టెక్ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ కోరింది. ఈ లోపం కార‌ణంగా హ్యాక‌ర్లు డేటా చోరికి తెగ‌బ‌డే ముప్పుఉంద‌ని హెచ్చ‌రించింది. ప్రింట్ నైట్‌మేర్ గా పిలిచే ఈ వైరస్.. విండోస్ ప్రింట్ స్ఫూలర్ సేవలను ప్రభావితం చేయనుందంట. ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ సంస్థ సాంగ్‌ఫోర్ పరిశోధకులు దీనిని ఎలా ఎదుర్కోవాలో వివరించారు.

విండోస్‌లో అనేక ముంది యూజర్లు ఒకేసారి ప్రింటర్‌ను ఉపయోగించేందుకు ప్రింట్ స్పూల‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే.. ఇందులో భ‌ద్ర‌తాప‌ర‌మైన లోపాలు ఉన్న‌ట్లు గుర్తించిన‌ట్లు సాంగ్‌ఫ‌ర్ అనే సైబ‌ర్ సెక్యూరిటీ కంపెనీ ప‌రిశోధ‌కులు ఈ ఏడాది మేలో గుర్తించిన‌ట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అనుకోకుండా పోస్ట్ చేశారు. అనంత‌రం డిలీట్ చేశారు. అయితే.. అప్ప‌టికే చాలా మంది స‌ద‌రు స‌మాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఈమేరకు మైక్రోసాఫ్ట్ యూజర్లను హెచ్చరించింది. ఈ లూప్ ‌హోల్‌తో హ్యాకర్లు మన పర్మిషన్ లేకుండానే మన పీసీని తమ ఆధీనంలోకి తీసుకుంటారని, అలాగే డేటాను డిలీట్ చేయడం, కొత్త యూజర్లను క్రియోట్ చేసేందుకు పూర్తి అనుమతిని అందించనుందంట. దీంతో యూజర్ల సిస్టం, ల్యాప్‌టాప్‌లను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటారని హెచ్చ‌రించింది.

విండోస్‌-10తో పాటు విండోస్‌-7లోనూ ఈ లోపం ఉన్న‌ట్లు తెలిపింది. వాటి కోసం అప్‌డేట్‌ల‌ను విడుద‌ల చేసింది. వాస్త‌వానికి 12 ఏళ్ల క్రితం విడుదలైన విండోస్ 7కి గతేడాది నుంచి సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఆపేసింది. అయితే, ప్రస్తుతం వచ్చిన సమస్యతో పాత ఓఎస్‌కు కూడా అప్‌డేట్ అందించింది.

Next Story