మ‌హిళ‌ల‌కు భారీ షాకిచ్చిన బంగారం.. 50వేలు దాటేసింది

May 27th gold Price.గ‌త కొద్ది రోజుల‌గా స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర నేడు భారీగా పెరిగింది. 50వేలు దాటేసింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2021 8:11 AM GMT
gold price

గ‌త కొద్ది రోజుల‌గా స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర నేడు భారీగా పెరిగింది. కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతాయ‌ని అనుకుంటున్న త‌రుణంలో భారీగా పెర‌గుతున్నాయి. క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవ‌డంతో ధ‌ర‌లు పెరుగుతున్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు. అత్య‌ధికంగా హైద‌రాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.500 పైగా పెరిగి .46,100కి చేరింది. ఇక బంగారం బాట‌లోనే వెండి కూడా న‌డిచింది. కిలో వెండి ధ‌ర రూ.1300 పెరిగి రూ. 77,300కి చేరింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర ఇలా..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 51,000

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,700

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,880, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,650

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300

బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటివి బంగారం ధ‌ర‌ల్లో మార్పులకు కార‌ణ‌మ‌వుతాయ‌ని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.


Next Story