చుక్క‌లు చూపిస్తున్న బంగారం ధ‌ర‌.. ప్ర‌ధాన‌ న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

Today's Gold Rate. గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 May 2021 5:36 AM GMT
Todays  Gold Rate

బంగారం కొనాల‌నుకునే షాకిస్తున్నాయి పెరుగుతున్న ధ‌ర‌లు. గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో మే నెల నుంచి మ‌ళ్లీ ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు బంగారాన్ని కొనుగోలు చేయ‌డం త‌ల‌కు మించిన భారంగానే మారింది. ఇక తాజాగా ఆదివారం దేశీయంగా 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.210 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,060 ఉంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,060, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,060

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,910

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980

బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటివి బంగారం ధ‌ర‌ల్లో మార్పులకు కార‌ణ‌మ‌వుతాయ‌ని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.




Next Story