దిగొస్తున్న పసిడి ధరలు.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర
May 15th Gold price.మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక అవసరాల్లో బంగారం
By తోట వంశీ కుమార్ Published on 15 May 2022 2:59 AM GMTమిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక అవసరాల్లో బంగారం ఆదుకుంటుందని బావించడమే అందుకు ప్రధాన కారణం. ఇక పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు పెరిగిన పసిడి ధరలకు బ్రేక్ పడింది. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర తగ్గింది. ఆదివారం 10గ్రాముల పసిడి ధర రూ.200 మేర తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,370, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,670
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,320, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,520
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,520
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,520
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల ధర రూ.50,520
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.