సిగ్నల్ యాప్ వాడుకుంటున్న ఫేస్‌బుక్ సీఈవో..!

Mark Zuckerberg uses signal app. ఫేస్‌బుక్‌లో సమాచార భద్రత...ఎండ్‌- టు - ఎండ్‌ ఎన్కిప్షన్‌ లేనందున సిగ్నల్‌ యాప్‌ను వినియోగిస్తున్నారంటూ భద్రతా నిపుణుడు దేవ్‌వాకర్‌ పేర్కొన్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2021 3:53 AM GMT
Mark Zuckerberg

డేటా లీకేజీపై ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా గొడవలు, కేసులు నడుస్తుండగానే ఇప్పుడు మరో ముఖ్య సమాచారం బయట పడింది. తాజాగా ఫేస్ బుక్ సీఈఒ మార్క్ జుకర్ బర్గ్ నెంబర్ లీక్ అయ్యింది. విచిత్రం ఏమంటే ఆయనకు సిగ్నల్ యాప్ లో ఖాతా ఉందని, ఆయన ఫోన్ నెంబర్ కూడా ఆన్ లైన్ లో పెట్టారని హ్యాకింగ్ భద్రతా పరిశోధకుడు ఒకరు వెల్లడించడం విశేషం. ఇదే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉణ్న 533 మిలియన్ల ఫేస్ బుక్ ఖాతాదారు వ్యక్తిగత వివరాలు లీకేజీకి గురైనట్లు తెలిపారు. ఇందులో 60 లక్షల మంది ఇండియన్లు ఉండగా యూఎస్ కు చెందిన వారు 32 మిలియన్లు ఉన్నారు. ఈ నెంబర్లకు సంబంధించిన వివరాలు డేటాబేస్ హాక్టర్ల ఫోరంలో పోస్టు చేసేశారు.

బాధితుల్లో ఫేస్ బుక్ సహా వ్యవస్థాపకులు డస్టిన్ మొస్కోవిట్జ్, క్రిస్ హ్యూస్ కూడా ఉండడం కలవరపరిచే అంశం. జుకర్‌బర్గ్‌ కూడా సమాచార గోప్యతను కోరుకుంటున్నారని, తన సొంత సంస్థ అయిన ఫేస్‌బుక్‌లో సమాచార భద్రత...ఎండ్‌- టు - ఎండ్‌ ఎన్కిప్షన్‌ లేనందున సిగ్నల్‌ యాప్‌ను వినియోగిస్తున్నారంటూ భద్రతా నిపుణుడు దేవ్‌వాకర్‌ పేర్కొన్నారు. సైబర్ ఎక్స్ పర్ట్ డేవ్ వాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం జుకర్ పేరు, ఫేస్ బుక్ యూజర్ ఐడి, జన్మస్థలం, చదువుల, వివాహం, స్నేహితుల వివరాలు లీకేజి అవ్వడం ఫేస్ బుక్ పెద్దలను నిద్రలేకుండా చేస్తున్నది.


లీకైన్ ఫోన్ నెంబర్ స్క్రీన్ షాట్ తో పాటు ఆయనకు సిగ్నల్ యాప్ లో అక్కౌంట్ ఉందంటూ ట్వీట్ చేశారు. ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని వాట్సప్‌ నూతన గోప్యతా నిబంధనలపై పలువురు వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సిగ్నల్‌ యాప్‌కు మారుతున్న సమయంలోనే ఈ వార్త రావడం గమనార్హం. అయితే.. గత జనవరిలో సమాచారం లీకైందని, ఇది పాత డేటా అని ఫేస్‌బుక్‌ కొట్టిపారేసింది. ఏదిఏమైనా జుకర్‌ బర్గ్‌ సిగ్నల్ ‌యాప్‌కు రావడమంటే ఆయన సమాచారానికి కూడా భద్రత లేనట్లే కదా..!


Next Story