షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
March 5th Gold Rate.మనదేశంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఇక పసిడి ధరల్లో నిత్యం
By తోట వంశీ కుమార్ Published on 5 March 2022 7:41 AM ISTమనదేశంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఇక పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఓ సారి ధర తగ్గితే మరో సారి పెరుగుతూ ఉంటుంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. శనివారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.440 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా పసిడి ధరల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,270
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,770, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,110
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700, 24 క్యారెట్ల ధర రూ.52,040
వెండి ధరలు..
కిలో వెండి ధర ఢిల్లీలో రూ. 68,000, ముంబైలో రూ. 68,000, చెన్నైలో ధర రూ. 72,500, కోల్‌కతాలో 68,000 కేరళలో రూ. 72,500, హైదరాబాద్‌లో రూ. 72,500, విజయవాడలో రూ. 72,500, విశాఖపట్నంలో రూ.72,500 గా ఉంది.
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.