శుభవార్త.. వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధర
March 31st Gold Price.గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు దిగివస్తున్నాయి. వరుసగా మూడో
By తోట వంశీ కుమార్ Published on 31 March 2022 2:12 AM GMTగత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు దిగివస్తున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం ధర తగ్గింది. గురువారం 10 గ్రాముల పసిడి ధర పై రూ.120 మేర తగ్గింది. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా ధరల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,920, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,280
- కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,030
-హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల ధర రూ.51,980
వెండి ధరలు
వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కిలో వెండి ఢిల్లీలో రూ. 68,000, ముంబైలో రూ. 68,000, చెన్నైలో రూ.72,100, హైదరాబాద్లో రూ. 72,100, విజయవాడలో రూ. 72,100, విశాఖపట్నంలో రూ. 72,100 గా కొనసాగుతోంది.
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.